NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుంది..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మోడీ వేవ్ నడుస్తుందన్నారు. బలహీన నియోజకవర్గాల్లో కూడా పుంజుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను నిన్నటి సభలో మోడీ తిప్పి కొట్టారని తెలిపారు. బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుందన్నారు. రాజ్యాంగం అంటే తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని చింపేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు. ఓట్ల కోసం కాకుండా.. రాజ్యాంగాన్ని తెలుసుకుని రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకుకోవాలన్నారు. రేవంత్ పని అయిపోయింది.. రేవంత్ కార్డ్ కింద పడేశాడు.. ఇక నమ్మరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Director Krish: వీరమల్లు నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? అసలు కథ ఏంటి?

లోక్ సభ ఎన్నికల్లో మోడీకే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని అన్నారు. నిన్న జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్ లో బీసీ లకు 50 సీట్లు ఉంటే అందులో 31 మంది నాన్ బీసీ గెలిచారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ ల వల్ల బీసీ లకు అన్యాయం జరిగిందని, తెలంగాణ మీ వెనక ఉందని మోడీ కి తెలుపుదామన్నారు కిషన్‌ రెడ్డి. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతుందని.. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు.
Harirama Jogaiah: కూటమి మేనిఫెస్టోపై స్పందించిన హరి రామజోగయ్య.. అది దురదృష్టకరం

Show comments