NTV Telugu Site icon

Kishan Reddy: దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే..!

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: చేతల ప్రభుత్వం మోడీ ది అని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నారు. ఎరువుల కోసం క్యూ లు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఫార్మ్ హౌస్ లో కూర్చొని తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ లో ఉన్న వారి వల్ల నా తెలంగాణ రైతులు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. అన్ని రకాల కేంద్రం సహకారం అందిస్తున్న రైతులు ఆత్మహత్యలపై కల్వకుంట్ల కుటుంబం ఎందుకు ఆలోచన చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఆత్మ హత్యల్లో 70 శాతం కౌలు రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం తియ్యగా మాట్లాడి తెలంగాణ ప్రజల గొంతులు కొస్తుందని మండపడ్డారు.

Read also: Tamannaah Bhatia Pics: తమన్నా భాటియా హాట్ ట్రీట్.. ఇలా చూపిస్తే అంతే సంగతులు!

కల్తీ విత్తనాలలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది… గులాబి దండు కారణంమని అన్నారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఏమైంది కేసీఆర్? అని ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఏమయ్యాయి? అని అన్నారు. కేంద్రం ఒక యూరియా బస్తా పై వెయ్యి 63 రూపాయల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులను మోసం చేయడానికి కేసీఆర్ పుట్టిండు అని తీవ్రంగా మండిపడ్డారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? అని ప్రశ్నించారు. కొత్త రుణాలు రాకా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దగ్గర మంగళ సూత్రాలు తాకట్టు పెట్టీ డబ్బులు తెచ్చుకుంటున్నారని అన్నారు. డిఫాల్టర్ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపణలు గుప్పించారు. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఇది నిజాం రాజ్యం… కల్వకుంట్ల రాజ్యాంగం… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Talangana Rains: హమ్మయ్య ఆ టైం వరకు వర్షం లేదట.. వాతావరణ శాఖ వెల్లడి

ప్రగతి భవన్ లో తప్ప 24 గంటల కరెంట్ ఎక్కడా లేదని అన్నారు. రైతులను నిండా ముంచింది ధరణి పోర్టల్ అని మండిపడ్డారు. భూముల లెక్కలను కెసిఆర్ సమాధి చేశారని అన్నారు. ధరణి బాధితుల సంఖ్య 20 లక్షల పైగా ఉందని తెలిపారు. రైతులు మనోవేదనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భూమి కోసం రైతు కోర్ట్ కు వెళ్లాల్సి వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం లో రైతు ప్రభుత్వం రావాలన్నారు. మోడీ నాయకత్వం లో తెలంగాణ లో రైతు ప్రభుత్వం నీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు. కేసీఆర్ ఇక నీ పరిపాలన చాలు అని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు.
మోడీ కి అండగా నిలవాలని కోరుకుంటున్నానని పిలుపు నిచ్చారు.
Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం