NTV Telugu Site icon

Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400సీట్లు రావడం ఖాయం..!

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బస్తీ పర్యటనలో భాగంగా.. నల్లకుంట డివిజన్, సత్యానగర్, రత్ననగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీల్లో కిషన్ రెడ్డిని అడుగడుగునా సాధారస్వాగతించారు. మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, కిషన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ప్రతిఒక్కరిఇన పలకరిస్తు కిషన్ రెడ్డి ముందుకు సాగారు. అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదగా కాసేపు ముచ్చటించారు. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటగిరిలో పర్యటించారు. వేంకటగిరి చేరుకున్న కేంద్రమంత్రి ముందుగా స్థానిక పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

Read also: Mouni Roy: బ్లాక్ గౌన్ లో మెరిసిపోతున్న మౌని రాయ్…

అనంతరం బస్తిలో స్థానికులతో కలిసి కలియతిరిగారు. అత్రియ 10 అపార్ట్మెంట్ సభ్యులతో ముచ్చటించారు. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీ సాయి కిరణ్ అపార్ట్మెంట్ లో కేంద్రమంత్రి పర్యటన కొనసాగుతుంది. అపార్ట్మెంట్ వాసులు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అపార్ట్మెంట్ పెద్దలు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి నల్లకుంటలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. తాను అంబర్ పేట్ బిడ్డను, సికింద్రాబాద్ ఎంపీ కాకముందు మూడు సార్లు అంబర్ పేట ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.

Read also: Atchannaidu: వాలంటీర్లపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన.. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం..

ఈరోజు అంబర్ పేట నియోజకవర్గంలో కొన్ని బస్తీలు తిరగి, బస్తీ పెద్దలందరిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ప్రజలు నన్ను వారి కుటుంబ సభ్యుడిలాగ ఆప్యాయతతో పలకరిస్తున్నారని తెలిపారు. మీకు అండగా మేముంటామని.. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం, వారి పట్ల అభిమానంతో ఉన్నారన్నారు. మోడీ నాయకత్వంలోనే మన దేశం, పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో మోడీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారని తెలిపారు.

Read also: Venky Sequel: వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!

బీజేపీ పార్టీకి 2019లో 302 సీట్లు వస్తే ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనేక సంస్కరణలు చేయడంతో దేశ ప్రజలు 370 సీట్లు కట్టబెట్టపోతున్నారరు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయమన్నారు. దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో నిర్ణయించే ఎన్నికలు కావు.. ప్రజలు నరేంద్రమోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. బీజేపీ పార్టీకి ఎన్ని పెరుగుతాయనే చర్చ ప్రజల్లో జరుగుతుందన్నారు. కులాలు, మతాలతీతంగా ప్రజలు మోడీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Himanta Biswa Sarma: 2026 నాటికి కాంగ్రెస్ కనుమరుగు..