హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మభ్యపెట్టి, ఆశపెట్టి సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ మిగతా పార్టీలకు తేడా ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కన్నా.. దేశమే గొప్పదని చెప్పే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని, దేశ హితం కోసం ఆన్నాడన్నారు. భారతీయ జనసంఘ్ ను జనతా పార్టీలో మెర్జ్ చేశామని, రెండు ఎంపీ స్థానాలు గెలిచిన రోజు అవహేళన చేశారు.. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.
Vinakayaka Statues: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం.. ఏ జిల్లాలో ఉందంటే?
దేశం కోసం బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేస్తుందో.. పార్టీలో అధికారంలో ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు.. దేశం కోసం పార్టీ పనిచేస్తోందన్నారు కిషన్ రెడ్డి. కనీసం వంద మందికి పైగా సభ్యత్వం చేసిన వారికే… పార్టీ పదవులు అని, క్రియాశీలక సభ్యత్వం కావాలంటే వంద మందిని విధిగా చేర్పించాలన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే పార్టీ పదవులు అని, సభ్యత్వ నమోదు లక్ష్యం అనుకున్న మేరకు పూర్తి చేయాలన్నారు కిషన్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 36 శాతం వరకు ఓట్లు వచ్చాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు కిషన్ రెడ్డి.
Vizag: విశాఖలో కుండపోత వర్షం.. ప్రమాదకర స్థితిలో ఇళ్లు