Kishan Reddy: నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై బుధవారం ఇందిరాపార్కు వద్ద 24 గంటల దీక్షను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అయితే సాయంత్రం 6 గంటలకు పోలీసులు రంగంలోకి దిగారు. దీక్షా ప్రాంగణాన్ని చుట్టుముట్టి కిషన్ రెడ్డిని బలవంతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ధర్నా చౌక్ వద్ద తోపులాట జరిగింది. అయితే ఈ గొడవలో కిషన్ రెడ్డి చేతికి, ఛాతీకి గాయాలు కావడంతో అక్కడికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధర్నాచౌక్ వద్దకు చేరుకుని నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాన్ని అభినందిస్తున్నా. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు.
Read also: Tamilisai: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన కార్మికులు
బీజేపీ సత్తా ఏంటో ఇప్పటికే కేసీఆర్ కు వివిధ సందర్భాల్లో చాటిచెప్పిందన్నారు. కిషన్ రెడ్డి బుధవారం శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అయితే శాంతియుతంగా ధర్నా చేసినా.. సమస్య ఏమిటో కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే పోలీసులను పంపి దీక్ష భగ్నం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసునని విమర్శించారు. యువత కేసీఆర్ ను గద్దె దించాలని.. తెలంగాణ బతకాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం ఉందని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఉద్యమాన్ని కొనసాగిద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పడంతో ఎన్నికలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేక కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Adilabad: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. మృతదేహం ముందే ఆస్తిపంపకాలు..