NTV Telugu Site icon

Kishan Reddy: యెండల లక్ష్మీ నారాయణపై దాడి.. స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న యెండల లక్ష్మి నారాయణతో పాటు కార్యకర్తలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది బీఆర్ఎస్ గుండాలపనే అని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఆయనపై జరిగిన దాడిపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతో పాటుగా లక్ష్మీనారాయణ గారి డ్రైవర్‌పై భౌతికదాడులకు దిగడం హేయనీయమని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: Telangana Rain Alert: ఎలక్షన్ పోలింగ్ డేకు వరుణ గండం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

పదేళ్ల పాలనలో చెప్పుకునేలా చేసిందేమీ లేదు. దాంతో ప్రజలు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను నమ్మకలేకపోతున్నారు. ఆ అసహనంతో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతున్న బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ.. బీఆర్ఎస్ గుండాల దాడులకు భయపడదన్నారు. సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ.. బీఆర్ఎస్ గుండాల దాడులకు భయపడదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్‌లోనే ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Also Read: Shrimp Farming : రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

బాన్సువాడ నియోజకవర్గంలో గెలుపు బీజేపీదే అని తెలిసి బీఆర్ఎస్‌లో వణుకు మొదలైందని అన్నారు. వైఫల్యాలతో జనం తిరగబడుతుంటే.. వారి సమస్యలను పరిష్కరించకుండా.. బీజేపీపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో బీజేపిని నేరుగా ఎదుర్కోవాలి తప్ప.. ఇలాంటి దాడులు చేయించడం పిరికిపంద చర్య అని ఆయన ధ్వజమెత్తారు.