Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!

  • పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు
  • బీజేపీ నేతల హౌస్ అరెస్టులపై కిషన్ రెడ్డి ఫైర్
  • జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
  • విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామన్న కేంద్రమంత్రి
Kishan Reddy

Kishan Reddy

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది ప్రజా పాలన కాదు, పోలీసుల నిర్బంధ పాలన అని స్పష్టమవుతోంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే వివాదాస్పద జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్, మాసాబ్‌ట్యాంక్, రామంతపూర్ నుంచి మొదలుకొని వనపర్తి, పరకాల దాకా విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా రోడ్డెక్కితే.. వారిపై లాఠీఛార్జీలు చేయించడం, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల న్యాయమైన ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్తున్న మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారితో పాటు పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనం. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థుల హక్కులను కాలరాస్తుంటే ఎందుకు కనిపించడం లేదు?

పాలిటెక్నిక్ సాంకేతిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థులకు ఉన్నత విద్య (ఈసెట్) అవకాశాలను దూరం చేసే కుట్రలను రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే విరమించుకోవాలి. కంటితుడుపు కమిటీలతో కాలయాపన చేయకుండా వివాదాస్పద జీవో 97ను వెంటనే బేషరతుగా రద్దు చేయాలి. తెలంగాణ విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి చివరిదాకా రాజీలేని పోరాటం చేస్తుంది.