Site icon NTV Telugu

Kishan Reddy: గాంధీ జయంతి స్ఫూర్తితో స్వదేశీ వస్తువులనే వాడదాం

Kishan Reddy (2)

Kishan Reddy (2)

స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను అందరికీ తెలియచేయాల్సిన అవసరం వుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడు స్వదేశీ వస్తువులను వినియోగించాలి , విదేశీ వస్తువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారో… దానినే స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని మోడీ సారధ్యంలో సమగ్రమైన భారత నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వదేశీ పరిజ్ఞానం తో భారత్ కరోన వ్యాక్సిన్ తో పాటు అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని… ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని ఆ ఘనత ప్రధాని మోదికి దక్కిందన్నారు.

Read Also: Mulayam Singh Yadav: ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

గాంధీ జయంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్ హైదర్ గూడలోని భారత్ ఖాదీ వస్త్రాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి ఖాదీ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఏ చిన్న వస్తువైన విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వాళ్ళమన్నారు. నేడు ఆపరిస్థితి లేదని, కరోనా వ్సాక్సిన్ దగ్గరినించి.. రాకెట్ లాంచర్ ల వరకూ మన దేశం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. దేశంలోని ప్రజలంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని … సెల్ ఫోన్లు కూడా ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీ తో తయారు అవుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: Rahul Ramakrishna: గాంధీపై ప్రముఖ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Exit mobile version