NTV Telugu Site icon

Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ నెల 2న కూడా కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3వ తేదీన నిజామాబాద్‌లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరతానని బీఆర్‌ఎస్‌ తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఈసీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఈ నెల 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన వరాలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా హామీ రాసుకున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ