Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Fires On Etela Rajender Attack Incident

Kishan Reddy: సెల్‌ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఈటెలపై కుట్ర జరుగుతోంది

Published Date :November 1, 2022 , 5:58 pm
By NTV WebDesk
Kishan Reddy: సెల్‌ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఈటెలపై కుట్ర జరుగుతోంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy Fires On Etela Rajender Attack Incident: పలివెలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కొన్ని రోజుల నుంచి ఈటెల రాజేందర్‌పై కక్ష సాధింపు జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల సెల్‌ఫోన్‌లను ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఈటల మొహం చూడొద్దని.. అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో జరగలేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం పలివెల గ్రామానికి వెళ్తే.. అక్కడ ఈటెలపై దాడులకు దిగారని, పక్కా ప్లాన్‌తో ఆ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పలివెలలో ఓట్లు రావని, మునుగోడులో ఓటమి తప్పదన్న భయంతోనే.. టీఆర్ఎస్ నేతలు ఇలా బస్తాల్లో రాళ్లు నింపుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

ఇటీవల టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసొచ్చి.. తన సభను కూడా అడ్డుకున్నారని కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. ఇప్పుడు ఈటెల కాన్వాయ్‌పై దాడికి దిగారని.. డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని మరి దాడి చేశారని చెప్పారు. ఇంత జరిగినప్పటికీ.. గొడవ జరగొద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనం పాటించి, అక్కడి నుంచి వచ్చేశారన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ కాలుకాలిన పిల్లిలా తయారైందని ఎద్దేవా చేశారు. పోలీసులు సైతం టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్ని దాడులు చేసినా తాము భయపడమని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతల కార్లను తనిఖీ చేస్తున్నారని, టీఆర్ఎస్ నేతల కార్లను మాత్రం వదిలేస్తున్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దాడి చేసినవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తారని కిషన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు.. ఈ దాడులపై ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మునుగోడు ఉపఎన్నికలో గెలవరనే భయంతోనే టీఆర్ఎస్ తమపై దాడులకు పాల్పడుతోందన్నారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్‌కు బేస్ కూడా లేదని, తమని ఎదుర్కొనే దమ్ము లేకే ఇలాంటి భౌతిక దాడులకు ఎగబడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గుండాయిజానికి తాము భయపడమని, పక్కా ప్లాన్‌తోనే ఈ దాడి చేశారన్నారన్నారు. మునుగోడు ప్రజల తీర్పుతో టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనడం ఖాయమని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Etela Rajender Attack
  • Kishan Reddy
  • Munugode By-Elections
  • TRS vs BJP

తాజావార్తలు

  • Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!

  • G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!

  • CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • Shoaib Akhtar: “భారత్ క్రికెట్‌ను నాశనం చేసింది”.. టీమిండియా గెలుపుపై షోయబ్ అక్తర్ నోటిదురుసు..

ట్రెండింగ్‌

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions