Site icon NTV Telugu

Kishan Reddy : గౌరవ ముఖ్యమంత్రి కి గౌరవంగా సమాధానం చెప్పుతాం

హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్‌లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన అన్నారు. ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్ పైన అన్ని విషయాలతో త్వరలో డీటెయిల్ గా మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో అన్ని మ్యూజియంలను అభివృద్ధి చేస్తామని, కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సెంట్రల్ విస్టాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లో కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామని, జమ్మూ కాశ్మీర్ చరిత్ర పై మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. బిర్సా ముండా చరిత్ర పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ట్రైబల్ మ్యూజియం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అలాట్ చేయలేదని ఆయన తెలిపారు. ఈ నెల 15, 16 అంతర్జాతీయ మ్యూజియం సదస్సును హైదరాబాద్ సాలర్జంగ్ మ్యూజియంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version