Site icon NTV Telugu

Kishan Reddy: వెయ్యి బీఆర్ఎస్‌లు, ఎంఐఎంలు వచ్చినా మోదీని ఏం చేయలేవు.. కేసీఆర్ పతనం ప్రారంభమైంది

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy criticizes TRS and CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ మీద గౌరవం ఉందడు.. రాజకీయ పార్టీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులపై గౌరవం ఉందడని..ప్రధాన మంత్రికి కనీస మర్యాదు ఇవ్వరని.. యాత్రను అడ్డుకుంటారు, అక్రమ కేసులు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎజెంట్ల లాగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని.. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని..కేసీఆర్ ఆదేశాలను పాటించడం ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కిషన్ రెడ్డి అన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కారని.. తెలంగాణలో మీ పతనం ప్రారంభం అయింది. 17 సీట్లలో 8 లోక్ సభ సీట్లను ఓడిపోయారని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఒక్క కేసీఆర్, ఒక్క అసదుద్దీన్ ఓవైసీలు కాదు వెయ్యిమంది వచ్చినా..వెయ్యి బీఆర్ఎస్ పార్టీలు, వెయ్యి ఎంఐఎం పార్టీలు పెట్టినా కూడా నరేంద్ర మోదీని అడ్డుకోలేరని.. 2024లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అవినీతి కుంభకోణాలపై, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేస్తామని అన్నారు. దోపిడి చేస్తున్న టీఆర్ఎస్ నాయకుడి నుంచి ప్రతీ పైసా వసూలు చేసి ప్రజలకు ఇస్తాం అని అన్నారు.

Read Also: YS Vijayamma: దీక్షకు దిగిన విజయమ్మ.. నా కూతురిని నేను చూడకూడదా ఇదేం న్యాయం

ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదు, దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయడం లేదు, దళితులకు రిజర్వేషన్లు, మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేస్ రాష్ట్రంలో ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్ క్వారీలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ ధరణి పేరుతో ఆక్రమిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ని ఓడించాలని దళితబంధు వచ్చిందని అన్నారు.

ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. 8 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని తాగుతుందని విమర్శించారు. నాకు పోలీసులు, మజ్లిస్ పార్టీ, డబ్బులు ఉన్నాయని కేసీఆర్ అనుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబంపై బీజేపీ యుద్ధం ప్రకటించిందని కిషన్ రెడ్డి అన్నారు.

Exit mobile version