NTV Telugu Site icon

Kishan Reddy: “వినాశ కాలే విపరీత బుద్ధి” అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy condemned the arrest of Bandisanjay: వినాశ కాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని అంబర్‌పేట్‌లో 6 నెంబర్ వద్ద ఫ్లైఓవర్ పనులను అధికారలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబం అభద్రతాభావంతో ఉందని విమర్శించారు. అధికారం నుండి మా కుటుంబం దూరమవుతుందని అభద్రతతో సీఎం కేసీఆర్ ఉన్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నిరాశ నిస్పృహతో ఉన్నారని విమర్శించారు.

అబద్ధాలు మాట్లాడుతూ విష ప్రచారాలు రాష్ట్రప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రెచ్చగొట్టు పాదయాత్రను అడ్డుకోండని పిలుపునిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలనను దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిన్న జరిగింది సింబాలిక్ ప్రొటెక్ట్ మాత్రమే అని, ఎవరింటికి ఎవరు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న పాదయాత్రను ఆపి అరెస్టు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండిస్తున్నామన్నారు. ఒక అభద్రతాభావంతో అధికారం చేయి జారిపోతుందన్న భయంతోనే బండి సంజయ్, రాజాసింగ్ లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వినాశ కాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తులు లభిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
The crowd crushed the thief: దొంగకు దేహశుద్ధి.. ఎందుకో తెలుసా?