NTV Telugu Site icon

Kishan Reddy: అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు.. కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

Kishan Reddy Comments On KCR Government: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌​ను విశ్వనగరంగా చేస్తున్నామని చెప్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. సిటీ బస్తీల్లో మాత్రం కనీస వసతులు కల్పించడం లేదని అన్నారు. ఒకప్పుడు ఫిక్స్​డ్​ డిపాజిట్లు ఉన్న జీహెచ్​ఎంసీ.. ఇప్పుడు రాష్ట్ర సర్కారు తీరుతో అప్పులపాలైందని ఆరోపించారు. నాంపల్లిలోని గుడిమల్కాపూర్​ డివిజన్​ షాద్‌నగర్​ కాలనీలో రూ.44 లక్షలతో చేపట్టే వీడీసీసీ రోడ్, వాటర్​ పైప్​లైన్​ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్​ నుంచి అత్యధిక ఆదాయం వస్తోందని, అయినా సరే ఆమేరకు బస్తీల్లో కనీస వసతులకు సైతం ఖర్చు చేయడం లేదని చెప్పారు. బిల్లులు రాకపోవడం వల్ల ఇటీవల 700 మంది కాంట్రాక్టర్లు జీహెచ్​ఎంసీ ఆఫీసు ముందు ధర్నా చేశారని గుర్తు చేశారు.

LSG vs PBKS: ముగిసిన లక్నో బ్యాటింగ్.. పంజాబ్ ముందు 160 లక్ష్యం

హైటెక్​ సిటీ, పాత బస్తీలు, కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. కేవలం మెయిన్ రోడ్లు బాగుంటే సరిపోదని, కాలనీల్లోనూ అన్ని వసతులు ఉండాలని సూచించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కాలనీల్లో నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాలనీల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. గుడిమల్కాపూర్ ప్రాంతానికి సంబంధించిన కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపణలు చేశారు. కాలనీ వాసులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని అనేక బస్తీల్లో కమ్యునిటీ హాల్స్, మంచినీటి కొరత తీర్చే బోరు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్

Show comments