Site icon NTV Telugu

Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు

Kishan Reddy

Kishan Reddy

Union Minister Kishan Reddy: ఏడాది పాటుగా పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని కొనియాడారు. తాజాగా సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ నచ్చుతుందని విమర్శించారు.కాంగ్రెస్ కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశం.. నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. పటేల్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ దని విమర్శించారు.

READ MORE: Tamannaah: సినిమాల నుంచి రియల్ ఎస్టేట్‌ దాకా..తమన్నా ఫైనాన్షియల్ సీక్రెట్ ఇదే!

“పటేల్ అంటే తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోరు.. సర్దార్ చేసిన త్యాగమే తెలంగాణ.. పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరింది.. నిజాం నిరంకుశత్వoపై ఉక్కు పాదం మోపిన ఘనుడు పటేల్.. నిజాం మెడలు వంచి తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేశారు.. ఈ ఏడాది అంత పటేల్ 150 జయంతి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకోవాలని కోరుతున్న.. ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని కోరుతున్న.. ప్రతి పౌరుడు పటేల్ చరిత్ర తెలుసుకోవాలి.. సర్దార్ స్పూర్తితో మోడీ అడుగులు వేస్తున్నారు.. వికసిత భారత్ లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు..” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version