NTV Telugu Site icon

Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన

Medigadda Barrege

Medigadda Barrege

Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారేజీ పిల్లర్ల కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనం కావడం.. కొంత రాజకీయ విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ పర్యటనకు రాజకీయ పార్టీలు క్యూ కట్టడంతో ఎక్కడా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బ్యారేజీని పరిశీలించగా, తాజాగా బీజేపీ నేతలు బ్యారేజీని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో బ్యారేజీని పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతి) బ్యారేజీని కూడా సందర్శించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజీ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బందికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంది.

బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పైర్ కుప్పకూలడం, దెబ్బతినడంతో సరిహద్దులో అక్టోబర్ 21 నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర జలవిద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ అక్టోబర్ 24న బ్యారేజీని సందర్శించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుండి కోరింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఆ కమిటీ తన తాజా నివేదికను విడుదల చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పైర్లు ప్లానింగ్, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాల వల్లే కూలిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. బ్లాక్ నంబర్ 7లో ప్రతికూల పరిస్థితుల వల్ల బ్యారేజీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది నిరుపయోగంగా ఉందని స్పష్టం చేశారు.
Ira Khan-Nupur Shikhare: ప్రారంభమైన అమీర్ ఖాన్ కుమార్తె ఇరా, నుపుర్ శిఖరేల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌