Site icon NTV Telugu

Kishan Reddy: ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరం ఉంది

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం వ్యవహరం ఉందని దుయ్యబట్టారు. ఓట్ల నిధుల కోసం ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. అసైన్మెంట్ భూములను లాక్కొని అమ్ముకుంటోందని.. ఇది ప్రజా వ్యతిరేక చర్య, దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సంపదను సృష్టించాలి తప్ప, నాశనం చేయకూడదని హితవు పలికారు. అనేక ఉపద్రవాలు కూడా వస్తాయ్నారు. దేశం అనుసరిస్తుందని ప్రగల్బాలు పలికే కేసీఆర్.. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దివాలాకోరుతనం, భూములు అమ్ముకోవడం.. వ్యవస్థ నాశనానికి నాంది అని పేర్కొన్నారు. సీఎం అసమర్థత కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

China Bubonic Plague: మరో ప్రాణాంతక వ్యాధి.. చైనాలో బయటపడ్డ బుబోనిక్ ప్లేగ్

అంతకుముందు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా తిరంగా ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బర్కత్‌పురా బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి నారాయణగూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజాది కా అమృత్ మహోత్సవ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము చేపట్టిందన్నారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగ్యసాములు కావాలన్నారు. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్‌లతో ర్యాలీ నిర్వహించాలన్నారు.

Karumuri Nageswara Rao : సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్

అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల జిల్లా కేంద్రాలలో 75 మొక్కలు నాటాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా.. చెట్లను నాటే కార్యక్రమానికి అమృత వనంగా పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలన్నారు. దేశంలో నిరుద్యోగ, పేదరిక సమస్యను నిర్మూలన కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు ఇందులో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Exit mobile version