ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలన్న కిషన్ రెడ్డి… నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తాడు. బండి సంజయ్, నాతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారు. ఈటల చేరికను ముఖ్యనేతల సహా.. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అసంతృప్తులు సహజం. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తాం. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి నన్ను విమర్శించినంతమాత్రానా నేను స్పందించాల్సి అవసరం లేదు. మంచి కేసీఆర్ ను.. చెడు మోదీకి ఆపాదించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారింది అని పేర్కొన్నారు.