Minister Tummala: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు. ఇక, మీ డివిజన్లను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, డివిజన్ కు కావలసిన మౌలిక సదుపాయాలు కమిషనర్ అభిషేక్ అగస్త్యను సంప్రదించండి అని సూచించారు. మన కార్పొరేషన్ ను చూసి ఇతర ప్రాంతాలు నేర్చుకునేలా ఉండాలి అన్నారు. నగరం ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కక్ష్యలకు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు.
Read Also: Visakhapatnam : వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులపై రచ్చ
అయితే, ఉన్నతమైన చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికాన్ని వీడుతుంది అని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. నగర వాసులకు హైదరాబాద్, అమెరికా కంటే మంచి చదువు ఖమ్మం నగరానికి వస్తుంది అని భరోసా ఇచ్చారు. పోలీసులకు సూచించా పార్టీల పరంగా పోలీసులు ఎవరి పైనా కేసులు పెట్టొద్దని.. అలాగే, రోడ్ల వెడల్పు కోసం నాయకుల ఇండ్ల అయినా కొంత తీసుకోక తప్పదు అన్నారు. బైపాస్ రోడ్డు వేసినప్పుడు నన్ను తిట్టుకున్నారు, ఇప్పుడు బైపాస్ రోడ్డు కూడా జామ్ అవుతుంది.. ఇంకా రెండు మూడు వందల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డినీ అడిగి తీసుకుని వస్తాను.. గుడిసెల్లో బ్రతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. పేదలకు మంచి చేసే విధంగా రాజకీయం ఉండాలి, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
