NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము..

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy: ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా తెలంగాణా లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయని అన్నారు. భారీ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. అర్ధరాత్రి వచ్చిన వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. గడిచిన 100 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదన్నారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు.

Read also: Minister Sitakka: ములుగులో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా..

ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వచ్చి వరదల వల్ల ఏర్పడిన పరిస్థితి చూసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి లేఖ రాశారని తెలిపారు. కేంద్రం ఆంద్రప్రదేశ్ కి ఏవిధంగా సాయం చేస్తుందో తెలంగాణాకి కూడా అలాగే చేయాలని తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము.
Ponnam Prabhakar: ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు..