NTV Telugu Site icon

KCR: బీఆర్ఎస్ నేతకు కేసీఆర్ సాయం.. రూ.10 లక్షల చెక్ అందజేత

Kcr

Kcr

బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంగో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన నివాసానికి కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో సుబ్బారావు దంపతులు.. కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.10 లక్షల చెక్‌ను సుబ్బారావు దంపతులకు కేసీఆర్ అందజేశారు. కేసీఆర్ సాయంపై సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు దంపతులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం టౌన్‌లో సుబ్బారావు.. పార్టీ కోసం విశేష కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించేవాడు. సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వాడు. ఇక ఖమ్మం జైల్లో కేసీఆర్ A1 గా ఉన్నప్పుడు, సుబ్బారావు.. A2గా ఉన్నాడు. అయితే ఇటీవల సుబ్బారావు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. సుబ్బారావు.. తన భార్యతో కలిసి కేసీఆర్‌ను కలిశారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు.