NTV Telugu Site icon

Godavari River: మరోసారి పెరుగుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

Bhadrachalam Flood

Bhadrachalam Flood

Godavari River: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది. నాలుగు రోజులకు 26 అడుగుల వరకు ఉన్న గోదావరి ఎగువన పెనుగంగా నుంచి వచ్చిన వరద వల్ల గోదావరిలో 20 అడుగులు ఒకేసారి పెరిగింది .దీంతో నిన్న సాయంత్రం 44 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం మళ్లీ గత రాత్రి నుంచి తగ్గటం ప్రారంభించింది. ప్రస్తుతం 43 అడుగుల వద్ద ఉండగా మళ్లీ కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read also: 35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ

ప్రధానంగా ములుగు భూపాలపల్లిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మల్లే స్వల్పంగా గోదావరి కొంత మేరకు పెరగవచ్చు. అయితే ఇది ప్రమాదకరస్థాయిలో పెరగదని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపైకి యాత్రికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఏడాది జూలై 27న భద్రాచలం వద్ద 53.9 అడుగుల మేర వరద రావడంతో మూడోసారి వరద హెచ్చరిక జారీ చేశారు. ఆ సమయంలో గోదారి తీర ప్రాంతం దద్దరిల్లింది. నదిలో నీటిమట్టం ఉధృతంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!