NTV Telugu Site icon

Kishan Reddy: కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారు.. రైతులకు భద్రత బీజేపీతో సాధ్యం

Kishanreddy

Kishanreddy

ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్ల అనచివేతకు గురైన గడ్డపై రైతు సభా జరుపుతున్నామని.. అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు.

Biggboss 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి రెండు హౌస్ లు.. ?

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల వారిని మోసం చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో అనేక సమస్యలు ఉన్నాయని.. రైతు రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రైతుల పంటలకు భీమ పథకం అమలు లేదని అన్నారు. కేసీఆర్ కోటి మాగాని ఏమైంది అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నష్ట పోతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకే గూటి పక్షులు అని.. ఎంఐఎం పార్టీకీ తొత్తులని విమర్శించారు. తెలంగాణ బాగుండాలంటే బీజేపికి ఓటు వేయండని కిషన్ రెడ్డి అన్నారు.

Mulugu Brs: ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు

అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతులకు భద్రత బీజేపీతో సాధ్యమన్నారు. కేసీఆర్ రింగ్ రోడ్డు భూములను అమ్ముకున్నాడని ఆరోపించారు. రైతు పంట కొంటానని చెప్పిన కేసీఆర్ దగా చేశాడని మండిపడ్డారు. సబ్సిడీలన్ని బీజేపీ అధికారం వచ్చాక అందజేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యుడు సొంతింటి కళ నెరవెరలేదని.. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల తెలిపారు. మరోవైపు ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మోసం చేయడంలో పీహెచ్ డి పొందాడాని దుయ్యబట్టారు. పాస్ పోర్ట్ దొంగ కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పేరు చెబితే బయట సిగ్గు పోతుందని.. పెగ్గు వేస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడని మండిపడ్డారు. తెలంగాణను అప్పుల స్టేట్ గా మార్చేశాడని.. తెలంగాణలో రామ రాజ్యం రావాలని బండి సంజయ్ అన్నారు.