Bhatti Vikramarka: బీఆర్‌ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడవెళ్ళి నుంచి కార్యక్రమాలు కొనసాగించడం నా సాంప్రదాయం అన్నారు. పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే కొనసాగించానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో పనులు జరుగడం లేదన్నారు. మోసం చేయడం మాటలు చెప్పడం బీఆర్ఎస్ కు అలవాటు అని మండిపడ్డారు. తెలంగాణ వస్తే జీవితాలు బాగు పడతాయని భావించారు. బీఆర్ఎస్ దొరలు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రజలు ఎన్నికల సమయంలో ఆలోచించాలని తెలిపారు. ప్రజల తెలంగాణ గెలవాలన్నారు. ప్రజల తెలంగాణ గెలవాలి అంటూ బట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపద వెలుగు నిండాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళా ఖాతంలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. ప్రజల సంపదను దోచుకోనివ్వమని.. రాష్ట్రంలో రాబడి చాలా వుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. 2004 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. మా హామీలను కూడా అమలు చేస్తామని బట్టి తెలిపారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీదనే వుంటుందని స్పష్టం చేశారు.
మధిర నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు నుంచి కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు తన అనుచర వర్గం మధుర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతుండగా తాజాగా బట్టి విక్రమార్క ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో పూజలు చేసి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు… గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నేతలు తోంకలసి ఊరేగింపులో పాల్గొని.. ఓటర్లను కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
MLA Lakshmareddy: లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపిస్తాం.. మిన్నంటిన సబ్బండ వర్గాల తీర్మానం