NTV Telugu Site icon

Bhatti Vikramarka: వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా అర్ధరాత్రి 1 గంట వరకు బాధితులతో భట్టి ముఖాముఖి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ఇందిర‌మ్మ రాజ్యంలోని ప్ర‌జాప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం ప‌నిచేస్తోంది. తాజాగా సంభ‌విస్తున్న ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం 24X7 అందుబాటులో ఉంది. ప్ర‌జ‌ల స‌మస్య‌లు తీర్చేందుకు నిరంత‌రం త‌పిస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మ‌రోసారి మున్నేరువాగు న‌గ‌రాన్ని ముంచెత్తే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క హుటాహుటిన ఖ‌మ్మం న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు త‌లెత్త‌వ‌చ్చ‌న్న వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల నేప‌థ్యంలో రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం బ‌య‌లు దేరారు.

Read also: Mallu Bhatti Vikramarka: మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పర్యటన..

దారి మొత్తం కుంభ‌వృష్టి కురుస్తున్న ప‌రిస్థితుల మ‌ధ్య ప్ర‌జా సంక్షేమం త‌ప్ప మ‌రేమీ ప‌ట్టించుకోకుండా భ‌ట్టి విక్ర‌మార్క రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో ఖ‌మ్మం చేరుకున్నారు. వెంట‌నే వ‌ర‌ద ముంపు ప్ర‌భావిత ప్రాంత‌మైన కాలువొడ్డు చేరుకుని అక్క‌డ ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. వ‌ర‌ద ముంపు అధికంగా ఉండ‌డంతో ప్ర‌జ‌లంతా సుర‌క్షిత ప్రాంతాల‌కు లేదంటే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పున‌రావాస కేంద్రాలకు త‌ర‌లివెళ్లాల‌ని సూచించారు. అనంత‌రం కాలవొడ్డు వ‌ద్ద‌ మున్నేరు బ్రిడ్జి దగ్గర వరదను పరిశీలించారు. అక్క‌డ‌నుంచి ఖమ్మం పట్టణంలో మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులని పరామర్శించారు. పున‌రావాస‌కేద్రంలో ఉంటున్న‌ బొక్కల గడ్డకు చెందిన వందకు పైగా కుటుంబాలతో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వం నుంచి అందుతున్న స‌హాయ‌స‌హ‌కారాల‌పై వ‌ర‌ద‌బాధితుల‌తో మాట్లాడారు. భోజన ఏర్పాట్లు వైద్య పరమైన అంశాలను పర్యవేక్షించారు. బాధితులకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించాలి అని అధికారులను ఆదేశంచారు.

Read also: Bhuvneshwar Kumar: చెలరేగిన భువీ.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్, 4 పరుగులు..

అక్క‌డ‌నుంచి వరద ముంపు బాధితుల కోసం ఖమ్మం నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరాదశ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు బాధితులకి సమయానికి ఆహారం, అనారోగ్యం ఏర్పడితే అందిస్తున్న వైద్య సేవలు గురించి బాధితులతో మాట్ల‌డారు. అక్క‌డే ఉంటున్న బొక్కల గడ్డ ప్రాంతానికి చెందిన మ‌రో యాభై కుటుంబాల ను పరామర్శించి ఏర్పాట్ల గురించి అడిగారు. అర్థారాత్రి 1 గంట సమయంలో ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని అర్ద‌రాత్రి రాత్రి పొద్దు పోయాక పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు బాధితుల వద్దకు వెళ్లి వారితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వారికి అందుతున్న ఆహారం, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న అనారోగ్యం వచ్చిన అధికారులు తక్షణం స్పందించి తమకు మందులు అందిస్తున్నారని బాధితులు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రికి వివరించారు.
Read also: Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?

అనంత‌రం ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి స్వయంగా తరలిస్తున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడారు. పై జిల్లాల లో ఇంకా వర్షాలు తగ్గలేదు.. మున్నేరు కాలవకు క్రమక్రమంగా వ‌ర‌ద‌ పెరుగుతుంది.. ఈ నేప‌థ్యంలో కాబట్టి ముందస్తుగా మున్నేరువాగు చుట్టుప‌క్క‌ల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ముంపు బాధితులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే ప్ర‌జా ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం, ఈ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం మాత్ర‌మే ప‌నిచేస్తుంద‌ని అని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రు మ‌న‌ బిడ్డ‌లేన‌న వారిని ఆదుకోవ‌డం ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యం అని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా చెప్పారు. వ‌ర‌ద ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఎంత ఖ‌ర్చు అయినా పెట్టేందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా అధికారులు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా ఆదేశాలు జారీ చేశారు.

Mallu Bhatti Vikramarka: మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పర్యటన..

Show comments