స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఖమ్మంలో కూడా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థులను బరిలోకి దించాయి. అంతేకాకుండా కావాల్సినంత ప్రచారం కూడా చేశాయి.
అయితే నేడు ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ ఖమ్మం పోలింగ్ సెంటర్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. గంటల తరబడి పోలింగ్ బూత్‌లో మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాల ఎలా ఉంటారని ఆయన పోలీసులను ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. అంతేకాకుండా అధికార పార్టీకి పోలీసులు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, పోలీసులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.