టన్నులకొద్దీ బరువు.. త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్టు బండరాళ్లు.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోని ఆ వాహనాలు యమ దూతల్లా దారి మధ్యలోంచి దూసుకొస్తుంటే వాటి ముందూ.. వెనక ఉన్న ప్రయాణీకులు బిక్కుబిక్కు మంటు ప్రయాణం చేయాల్సి వస్తుంది.లారీపై నుంచి రాళ్లు ఎప్పుడు తమ మీద పడతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న లారీలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కళ్లముందే అజాగ్రత్తగా, ప్రమాదకరంగా రాళ్ళను తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారు రవాణా, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Read also:Gayathri Raghuram: బీజేపీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్..
ఖమ్మం జిల్లాలో దాదాపు 300 ల వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. 200 క్వారీల నుంచి రాళ్లను వెలికి తీస్తున్నారు. ఖమ్మం గ్రామీణం, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్వారీల నుంచి రాళ్లను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తుంటారు. తరలింపు సమయంలో చాలామంది గ్రానైట్ క్వారీల యజమానులు నిబంధనలు పాటించటంలేదనే విమర్శలు ఉన్నాయి.గడిచిన రెండు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో రోడ్డుపై గ్రానైట్ ప్రమాదాలు జరిగిన అధికారులు మాత్రం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.
అనుభవం ఉన్న కార్మికులు, యంత్రాల సాయంతో లారీలో రాళ్లను లోడు చేయాలి. ఆ క్రమంలో బండ అటూ ఇటూ కదలకుండా వాటి కింద సపోర్టు ఉంచాలి. లారీ లోంచి రాళ్లు కిందపడకుండా పెన్సింగ్ తీగలతో కట్టాలి కానీ అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకోకుండానే గ్రానైట్ రాళ్ళను తరలిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు.. రద్దీగా ఉండే రహదారుల్లో భారీ వాహనాలలో ఈ రాళ్ళను తరలిస్తుంటారు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేక పోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీ తిగా రవాణా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తనిఖీలు చేసి ఇలా నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాల్లో రాళ్ళను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఖమ్మం పట్టణ వాసులు.
Read Also: GHMC : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో 9 ఓపెన్ జిమ్‌లు