NTV Telugu Site icon

Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!

Khammam

Khammam

Khammam Police: ఖమ్మం ట్రాపిక్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల బాధితులను వెంటనే గుర్తించడం, లైసెన్స్ లేని వాహనాలు రోడ్లపైకి రాకుండా చేసేందుకు గురువారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు తెలిపారు. నగర పరిధిలో లైసెన్స్ ప్లేట్లు, నంబర్ ప్లేట్లు, సక్రమంగా నంబర్లు, ట్యాంపర్డ్ నంబర్లు, తొలగించిన నంబర్లు ఉన్న వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.

Read also: Rajamouli : జపాన్ లో RRR సినిమా రీరిలీజ్.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..

ఈ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 50 వాహనాలను గుర్తించి సీజ్ చేసి జరిమానా విధించారు. వాహనం యజమానితో నంబర్‌ సరి చేయించి కౌన్సెలింగ్‌ అనంతరం అక్కడి నుంచి పంపించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండో ప్రాధాన్యత కింద నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. వింత శబ్దాలతో సైలెన్సర్లు అమర్చితే వాహనాలను సీజ్ చేస్తారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, పరిమితికి మించి వాహనాలు నడిపినా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో నంబర్‌ ప్లేట్లు లేకుండా రోడ్లపై వాహనాలు తిరుగుతూ పట్టుబడితే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
IPL 2024: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్!