Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్.. నిర్మాత వెంకట్ ఫోన్ మిస్సింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు భాగ్యనగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.. దీనిపై నార్కోటిక్స్ అధికారుల విచారణ వేగవంతం చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయి. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినీమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని వెల్లడించారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు వెంకట్ నిర్వయిస్తున్నారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు.
వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే వెంకట్ ఫోన్ మిస్ అయినట్లు తెలిపారు. వెంకట్ దగ్గర lsd డ్రగ్స్ తో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్ లో వెంకట్ డ్రగ్స్ పార్టీ పెడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే వెంకట్ ఫోన్ ఎలా మిస్ అయ్యింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. వెంకట్ ఫోన్ మిస్ చేశాడా? లేక ఫోన్ లో పెద్దవాళ్ల నెంబర్లు ఉండటం వలన ఎవరైనా తీసారా అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పజెప్పారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది. వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అంతేకాకుండా అపార్ట్ మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో అరెస్టయిన వారితో పాటు మరెవరైనా దాడులకు ముందు పాల్గొన్నారా? అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గతంలో టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారు. అయితే, కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
Pawan Kalyan: మరో 48 గంటల్లో సోషల్ మీడియాని తాకనున్న పవన్ తుఫాన్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!