NTV Telugu Site icon

MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

MLC Jeevan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ఓట్లు వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆశయ సాధనే జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కాకా అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనం కోసం ఎగువన లభించే నీళ్లను కిందకి తెచ్చాడన్నారు. మళ్ళీ పైకి ఎత్తి పోసే విధంగా 3 లిఫ్ట్ లతో చేసారని అన్నారు. 40 వేల కోట్లున్న కాలేశ్వరం ప్రాజెక్టును.. ప్రాజెక్టు 3 రేట్లు పెంచారన్నారు. అంబేద్కర్ దూర దృష్టితో రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కేసీఆర్ దోపిడీ అంతా మన కళ్ళ ముందు ఉన్న చరిత్ర అన్నారు. మూడు నెలల వ్యవధిలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. 1981 నుండి రాజకీయంలో ఉన్నాను. గెలుపు ఓటమి తేడా లేకుండా ప్రజా సేవలో ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ రాజకీయ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అలోచించి వేయాలని తెలిపారు. బీజేపీ హయాంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.

Read also: Sajjala Ramakrishna Reddy: బీజేపీ పక్షాన టీడీపీ వాళ్ళను ఎన్నికల బరిలోకి దించారు..

బ్లాక్ మని సంగతి ఏమైంది? అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలపై కేంద్రం ధరల భారం మోపుతుందన్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ఓట్లు వేయాలని కోరారు. అన్ని రంగల్లో దేశం దిగా జారీ పోయిందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేయడలచిన ఖలీస్థాన్ నిర్ములనకు ప్రాణాలు ఇచ్చిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అన్నారు. పాకిస్తాన్ గురించి మాట్లాడి విమర్శలు చేస్తూ జాతీయ భావం ఉప్పొంగించి రాజకీయ లబ్ది బీజేపీ పొందితుందన్నారు. పాకిస్తాన్ పార్టీ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రాబోయే పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ కను మరుగు అవ్వడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యంకు ఒక పరీక్ష లాంటిదని తెలిపారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం లోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతాఅని ఓ పార్టీ ఎంపీ మాట్లాడుతున్నాడన్నారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి ముప్పు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 15సీట్లు గెలవడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదన్నారు.
CJI Lawyers: ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు ముప్పు అంటున్న లాయర్లు..!

Show comments