Site icon NTV Telugu

TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో సంప్రదింపులు జరుగుతున్నాయి..

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇవాళ ఆంధ్ర ప్రస్తావన చేస్తోందన్నారు. సమంత ఎవరు.. అంబాసిడర్ ఎలా అయ్యిందన్నారు. రకుల్ ప్రీత్ తెలంగాణ అమేనా..? కేటీఆర్ కి బాగా తెలుసు ఈమె గురించని కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు కట్టిన ప్రాజెక్టు కట్టింది ఎవరు ?.. యాదగిరిగుట్ట నిర్మాణం డిజైనర్ ఎవరు..ఆంధ్ర వ్యక్తి కాదా..?.. ఇన్ని మీరు చేసి మేము రాష్ట్ర గీతం కీరవాణి పాడితే తప్పా? అన్నారు.

Read also: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం

కీరవాణి కి అవార్డులు వచ్చినప్పుడు కేటీఆర్.. కేసీఆర్ అభినందించ లేదా..? లోగోలో అమరుల స్థూపం పెడితే బీఆర్ఎస్ కి ఎందుకు నొప్పి? అమరవీరుల స్థూపం ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి ప్రజలకు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అమరుల ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. కానీ అధికారం లో ఉన్న పదేళ్లు ఆయన గౌరవానికి మచ్చ పడిందన్నారు. ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ ని పిలుస్తున్నామన్నారు.

Read also: K. Laxman: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే నిందితులను శిక్షించండి.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

ఆదివాసీ కాంగ్రెస్ అద్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కేసీఆర్ హయాంలో ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్ర గీతం పదేళ్లు లేదు.. ఎందుకు లేదని కేసీఆర్ ని ఎప్పుడైనా ఆడిగారా? అని ప్రశ్నించారు. అందె శ్రీ తో ఫోన్ లో మాట్లాడి… సోషల్ మీడియాలో పెట్టడం సంస్కరమా? అన్నారు. కేటీఆర్ కి సిగ్గు ఉండాలి.. మాట్లాడటానికి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసుగు వేసుకుని.. దోపిడీ చేసింది మీరు అని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి… కట్టడి చేసిన మీరా ఆత్మగౌరవం గురించి మాట్లాడేదన్నారు. అమరవీరుల స్థూపం లోగోలో పెడితే కేటీఆర్ కి వచ్చిన నష్టం ఏందన్నారు. ఉద్యమంలో టీజీ అన్నావు.. టీఎస్ ఎందుకు పెట్టావు.. అప్పుడు కేసీఆర్ ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీఎస్ పెడుతున్నం అని కేసీఆర్ ఎవరిని అడిగి పెట్టారు? అని అడిగారు. కేటీఆర్ అహంకారం జుట్టు నుండి ఇంకా కిందికి రాలేదన్నారు.
CM Revanth Reddy: సెయింట్ మేరీస్ స్కూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..

Exit mobile version