NTV Telugu Site icon

Ramya Haridas: నాకు పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి.. పాట పాడుతూ ఎంపీ రిక్వెస్ట్

Ramya Haridas

Ramya Haridas

పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే వరుడ్ని చూడమని ఓ కాంగ్రెస్‌ ఎంపీ చక్కటి పాటలు పాడి రిక్వెస్ట్‌ చేసారు. తనకి ఇంకా పెళ్ళి కాలేదని, ఓతమిళ అబ్బాయి వుంటే చూడమని ఆమె నాయకులను పాటపాడి కోరిన తీరు అందరిని ఆశ్చర్యపరించింది. ఓ ఎంపీ ఇలా వరుడు కావాలని అదీ తమిళ అబ్బాయినే చూడాలని నాయకులను రిక్వెస్ట్‌ చేస్తూ పాటపాడిన తీరు అందరిని ఆకర్షిస్తోంది.

read also: Macherla Niyojakavargam : నితిన్ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మిస్!

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈ రోడ్‌ లో కొత్తగా ఎన్నికైనా వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈనేపథ్యంలో ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అద్యక్షుడు లెనిన్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్‌ తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. నేను తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల్ని , ఆ పార్టీ వార్డ్‌ మెంబర్లను ఉద్దేశించి కేరళ.. అలథూర్​ కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఆమె స్టేజ్‌ పై కమల్ హాసన్​ మూన్రం పిరై సినిమాలోని కన్నె కలైమానే పాట, విజయకాంత్ ఆసై మచాన్ మూవీలో ఆదియిలా చేసిన సొల్లి అంటూ తమిళ పాటలు ఆలపించారు.

ఆమె పాటకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. రమ్యకు ఇంకా పెళ్లి కాలేదని.. తమిళ అబ్బాయిని చూడమని నాయకులను ఆమె కోరారు. రమ్య ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్​ పరిధిలో కొంత భాగం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. ఈనేపథ్యంలో పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లినప్పుడు తను తమిళ భాష​లోనే వారితో మాట్లాడాల్పి వస్తుంది కావున.. తనకు తమిళ అబ్బాయిని చూడండని, బాగుంటే ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటాను అంటూ స్టేజ్‌ పై ఎంపీ పాట పాడి వరుడు కావలెను పాటను పాడారు. ఎంపీ రమ్య పాటపాడిన తీరును సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వావ్‌ ఎంపీ కే వరుడు కావలెనని పాట పాడటం భలే వుందని కొందరు నెటిజెంట్లు కామెంట్లు పెడుతున్నారు.

read also: Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ బాట.. ఎందుకో తెలుసా..?

అయితే.. రమ్య హరిదాస్ కేరళలో అలథూర్​ లోక్​సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రమ్య తల్లి ఇంట్లో బట్టలు కుడితే, తండ్రి రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు. కాగా.. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇచ్చిన ఇంట్లోనే ఇప్పటికీ రమ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఎంపీ రమ్య పదో తరగతి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌ లో డిప్లొమా కోర్సు చేశారు. కాగా.. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసి, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పీకే బిజుపై 1,58,968 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే.. ఎన్నికల ప్రచారంలోనూ రమ్య, పాటలు పాడుతూ జనాలను హుషారెత్తించేవారు. ఆ..ప్రచారంలో రమ్య పాటలను వినడానికి చాలా మంది తరలివచ్చేవారు. మరి ఎంపీ రిక్వెస్ట్‌ కు ఏ వరుడు స్పందిస్తారో..

Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి

Show comments