Keesara ORR Road Accident: తెలంగాణలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ AP 09 BU 0990 కార్ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. అదే వేగంతో.. ఎదురుగా వస్తున్న మరో కార్ TS 05 UC 4666 టాటా విస్టాను ఢీ కొట్టడంతో దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదం కీసర ఓ అర్ ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్కేసర్ నుండి వస్తున్న బెంజ్ కార్ , షామీర్పెట్ వైపు నుండి వస్తున్న టాటా కార్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Read also: Crooked Thief: బొమ్మతుపాకీ చూపించాడు.. అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరు ఎక్కడి వెళుతున్నారు. అసలు ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వారు మద్యం సేవించి వున్నారా? లేక స్పీడ్ గా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇద్దరు మృతి చెందిన వ్యక్తులు, గాయపడి వారు ఎవరు ఎక్కడి నుంచి కారులో ప్రయాణిస్తున్నారు అనే వివరాలు తెలియాల్సి వుంది. ఓఆర్ఆర్ పై ఈఘటన జరగడంతో వాహనదారులు భయంతో వాహనాలను నిలబెట్టారు. రోడ్డంతా రక్తసిక్తంగా మరింది. వాహనాలను దారిమళ్లించారు పోలీసులు. అయితే ప్రయాణికులను తగు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుకుంటున్నారు.
Revanth reddy: రేపటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ విడుదల