Site icon NTV Telugu

Vivek Venkatswamy: నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది..టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాకొద్దు

Vivek Venkatswamy

Vivek Venkatswamy

Vivek Venkatswamy: మునుగోడు ప్రచారం కన్నా ఇప్పుడు హైదరాబాద్ లో పోలీసుల భారీ ఆపరేషన్ ఆకర్ష్‌ కలకలం రేపుతుంది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ లో పట్టుబడ్డవారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ వున్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండె డ్‌ గా పట్టుకున్నారు పోలీసులు.. పట్టుబడ్డవారంతా బీజేపీ వారే. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది. దీనిపై టీఆర్‌ఎస్‌, బీజేపీ వార్‌ జరుగుతుంది. మీ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ బీజేపీ, తెలంగాణను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేరని ఒకరినొకరు మాటలయుద్ధం జరుగుతుంది. ఈనేపథ్యంలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ ఫైర్‌ అయ్యారు.

Read also: Astrology : అక్టోబర్‌ 27, గురువారం దినఫలాలు

బీజేపీ ఎమ్మెల్యేలను ఎప్పుడు కొనలేదని, మధ్యప్రదేశ్‌ లో కూడా కొనుగోళ్లు చేయలేదని కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వస్తామంటే రాజీనామ చేసిన తర్వాతనే రావాలని పార్టీ చెప్పింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజురాబాద్ ఓటముల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్‌ కు వ్యతిరేకం అవుతున్నారు. సీఎం కు భయం పట్టుకుందని, కుటుంభ సభ్యులకు పదవులు ఇస్తున్నాడని, బంగారూ కల్వకుంట్ల పధకం సాగుతోందని అన్నారు. దేశంలో అవినీతిలో నంబర్‌ వన్‌గా కేసీఆర్‌ వున్నాడు. బీజేపీ మునుగోడులో గెలుస్తోందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ వున్నాడని, కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మొదలు పెట్టాడని, నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏమి చేస్తుందని, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు మాకు వద్దని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ పోలీసులను వాడుకున్నప్పటికి మాకు భయం లేదని, మునుగోడులో పోలీసులను బాగా కేసీఆర్ వాడుతున్నారని అన్నారు. 12 మందిని కొనుక్కుంది టీఆర్‌ఎస్‌ అని, 4గురితో మేము ఏం చేసుకుంటామని అన్నారు. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.
Astrology : అక్టోబర్‌ 27, గురువారం దినఫలాలు

Exit mobile version