KCR should walk forward for BJP free India: మోడీ సర్కార్ దుర్మార్గపు పాలన దేశంలో నడుస్తోందని, మోడీ నాయకత్వంలో దేశంలో రాక్షస పాలన కొనసాగుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ల్కాసుమన్ మండిపడ్డారు. చేతకాని దద్దమ్మల అసమర్థ పాలన దేశంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంను కపావడానికి నడుము బిగించాల్సిన సమయం వచ్చిందని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ దేశం కోసం ఏమి కావాలో చెబుతున్నారని, కానీ మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
దేశంలోని అన్ని వర్గాల వాళ్ళు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులము కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సినదిగా కోరుతున్నామని అన్నారు. మళ్ళీ కేసీఆర్ ఉద్యమం కోసం నడుం కట్టాలని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వుందని అన్నారు. మేమెంత కేసీఆర్ వెంట ఉంటామని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ముందుకు నడవాలని అన్నారు. బంగారు భారత్ కోసం కేసీఆర్ ముందుకు సాగాలని తెలిపారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ శ్రేణులు ఉంటాయని భరోసా ఇచ్చారు. తెలంగాణలో అమలు అవుతున్న కార్యక్రమాలు దేశంలో అమలు కావాలని కోరారు. నయా భారత్ , వీన భారత్ కోసం కేసీఆర్ అడుగులు పడాలని బాల్క సుమన్ కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు కేసీఆర్.. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.. ఈ నెల 11వ తేదీన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. హైదరాబాద్ రానున్నారు.. ఆ తర్వాత కొత్త పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, ఫ్రంట్‌లు, పొత్తుల లాంటి విషయాలపై జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే కేసీఆర్ దృష్టి సారిస్తున్నారనే విషయం తెలిసిందే.
Macherla Politics : బ్రహ్మారెడ్డి వచ్చినా క్యాడర్ లో నిరుత్సాహం ..!
