NTV Telugu Site icon

KCR Navagraha Yagam: ఎర్రవల్లిలో కేసీఆర్‌ దంపతులు నవగ్రహ యాగం..

Kcr

Kcr

KCR Chandi Yagam: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. నవగ్రహ యాగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతకు ముందు అయిత చండి యాగం, పలుమార్లు రాజశ్యామల యాగాలు కేసీఆర్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినాయక చవితి తర్వాత.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు… ఊరూరా బస్సు యాత్రలు చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా వినాయక చవితి, గులాబీ పార్టీ రోజునే విడుదలయ్యే అవకాశం కానుందని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు.

Read also: Harish Rao: జైనూర్ ఘటన అత్యంత పాశవికం..

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఐదు నెలల పాటు జైలులో ఉండి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తండ్రి (కేసీఆర్) వద్దే ఉంటున్నారు. అయితే ఇవాళ చండీ, నవగ్రహ యాగంలో కూడా కవిత పాల్గొన్నట్లు సమాచారం. కేటీఆర్ అమెరికాలో తన కొడుకు హిమాన్షుతో గడిపేందుకు అమెరికా వెళ్లారని సమాచారం. ‘ఆఫ్ టు అమెరికా.. డాడ్ డ్యూటీ బెకాన్స్’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఆయన అమెరికా పర్యటన విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షించారు. అమెరికాలోని కొందరు అభిమానులు మీ కోసం ఇక్కడ వేచి ఉన్నాము అంటూ ఆయనను ఆహ్వానించారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
Edupayala Temple: గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద