NTV Telugu Site icon

CM KCR: నూతన సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్.. ఏప్రిల్ లో ప్రారంభించేందుకు..

Kcr

Kcr

CM KCR: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. నూతన భవనం దగ్గరకు వెళ్లి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30 లో సెక్రటేరియట్‌, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లారు.

Read also: Bandi Sanjay: ట్విట్టర్ టిల్లూ నన్ను కెలికితే ఊరుకుంటానా.. అంతకు మించి సినిమా చూపిస్తా

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడినవిషయం తెలిసిందే.. ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ కొత్త సచివాలయాన్ని ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించాల్సి ఉండగా.. పెండింగ్ పనుల కారణంగా సచివాలయం ప్రారంభం ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. దీంతో మళ్లీ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడడం చర్చకు దారితీసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించగా.. జూన్ 2 లోపు ప్రారంభానికి సర్వం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయం ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు, పార్టీ నాయకులకు.. సెక్రటేరియట్ వాయిదా కాస్త నిరాశే అని చెప్పాలి. ఇవాల మళ్లీ సెక్రటేరియట్ పనులను పరిశీలించేందుకు సీఎం వెళ్లడంపై ఏప్రియల్ లోనే నూతన సచివాలయం ప్రారంభించాలని భావిస్తున్నారు.
Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్

Show comments