NTV Telugu Site icon

Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!

Ponnam

Ponnam

Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు. ప్రజలకు తప్పుడు సమాచారం పోవద్దు.. మీరు వేములవాడ, కొండగట్టు, బాసర, భద్రాచలం ఆలయాలపై అనేక ప్రకటనలు చేశారు కానీ నిధులు మాత్రం రాలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి ఇటీవల 8 మంది మంత్రులం వేములవాడలో పర్యటించాం.. రాజన్న ఆలయ అభివృద్ధికి నిత్యాన్నదాన సత్రంతో సహా అనేక కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. అలాగే, కొండగట్టు గిరి ప్రదక్షణలకు ఏర్పాట్లు చేశామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Read Also: Betting App Promotions: ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

అయితే, ధర్మపురిలో అనేక యాగాలు చేశాం ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు వచ్చారు.. కానీ, ప్రసాద్ స్కీమ్ కింద ఏం పనులు జరగలేదని మంత్రి పొన్నం తెలిపారు. ఇక, కాళేశ్వరం ఆలయం అభివృద్ధి జరగలేదు.. ఎమ్మెల్సీ తాతాజీ భద్రాచలం అభివృద్ధిపై చాలాసార్లు అడిగారు అది చేయలేదు.. గత ప్రభుత్వంలో ప్రకటనలు చేశారు తప్ప రూపాయి విడుదల చేయలేదు అని ఆయన మండిపడ్డారు.