తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విచ్చేశారు. 2026 ఆగస్టు 9వ తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి చేరుకున్న కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో ఘనంగా నివాళులర్పించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఈ కష్టసమయంలో పార్టీ పరంగా పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చి వారికి కొండంత భరోసానిచ్చారు. బీఆర్ఎస్ అధినేత రాకతో పార్టీ శ్రేణులు, నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో నల్లబెల్లికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కేసీఆర్ అక్కడికి చేరుకున్న నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ తిరుగుప్రయాణమయ్యారు.

