NTV Telugu Site icon

BRS MP Candidates: హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్‌.. 17 మంది వీరే..

Kcr

Kcr

BRS MP Candidates: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా.. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ధీటైన అడుగులు వేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌ను రంగంలోకి దించారు. హైదరాబాద్ నుంచి అభ్యర్థిని ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

Read also: D. Sridhar Babu: తెలంగాణ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు.. జులై నుంచి పంపిణీ..!

బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

* హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్
* ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ)
* మహబూబాబాద్ (ఎస్టీ) మాలోత్ కవిత
* కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
* పెద్దపల్లి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
* మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
* చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
* వరంగల్ – డాక్టర్ కడియం కావ్య (ఎస్సీ)
* నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బిసి)
* జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
* ఆదిలాబాద్ – ఆత్రం సక్కు (ఎస్టీ)
* మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
* మెదక్ – పి. వెంకట్రామి రెడ్డి (ఓసీ)
* నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఎస్సీ).
* సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ)
* భువనగిరి – క్యామ మల్లేష్ (బిసి)
* నల్గొండ – కంచర్ల కృష్ణా రెడ్డి (ఓసీ)
Congress: మోడీ వాటర్ గన్లపై కాంగ్రెస్ మండిపాటు..