KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్
- నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్
- రోడ్ నంబర్ 10 నుంచి 12కు అండర్‌పాస్ నిర్మాణం
- కొత్త డిజైన్‌తో రూ.400 కోట్ల వరకు నిధులు ఆదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రీ-అలైన్మెంట్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో ప్రతిపాదించిన సంక్లిష్టమైన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రణాళికను మార్చి, దానికి బదులుగా ఒకే ఒక భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మాణంతో నూతన రీ-అలైన్‌మెంట్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.
నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్
నూతన ప్రణాళిక ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ముఫ్ఫాకమ్ జా (MJ) ఇంజనీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్ పరిసరాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవునా భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి రోడ్ నెంబర్ 12కు అనుసంధానంగా ఒక అండర్‌పాస్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే రోజుల్లో వాహనాల రద్దీని తట్టుకునేలా ఈ ఫ్లైఓవర్‌ను పూర్తిగా 6 లైన్ల కారిడార్‌గా తీర్చిదిద్దనున్నట్లు కమిషనర్ తెలిపారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
శాశ్వతంగా వన్-వే విధివిధానాలు.. రూ.400 కోట్ల నిధుల ఆదా
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం అమల్లో ఉన్న వన్-వే ట్రాఫిక్ విధానంపై ప్రజల నుంచి అత్యంత సానుకూల స్పందన వచ్చిందని, అందుకే ఈ వన్-వే రూట్‌ను శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. వన్-వే మార్గంలో ఉన్న డివైడర్ల పరిమాణాన్ని తగ్గించి ఆ రహదారిని కూడా పూర్తిగా 6 లైన్ల విస్తీర్ణంలోకి తీసుకురానున్నారు. గతంలో అనుకున్న బహుళ ఫ్లైఓవర్ల స్థానంలో ఈ నూతన రీ-అలైన్మెంట్ చేపట్టడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల వరకు నిధుల వ్యయం తగ్గిందని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..