NTV Telugu Site icon

K.Kavitha: నేటితో కవిత కస్టడీ పూర్తి.. మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు..!

K.kavitha Arest

K.kavitha Arest

K.Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి గత ఆరు రోజులుగా విచారణ జరుపుతున్న కల్వకుంట్ల కవితకు తన అరెస్టు అక్రమమని ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నిబంధనలను పాటించకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అరెస్టు చేశారని కవిత కోర్టులో సవాల్ చేస్తూ రూస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల 15న అరెస్టయిన కవితను ఈడీ అధికారులు 16న రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో కవిత నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని కోరడంతో ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ అధికారులు గత ఆరు రోజులుగా విచారణ జరుపుతున్నారు. ఏడో రోజు (ఈరోజు) విచారణ పూర్తి చేసి మధ్యాహ్నం 12 గంటల లోపు కవితను మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వారం రోజులుగా కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించినట్లు సమాచారం.

Read also: TS Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి పొరపాట్ల సవరణకు ఛాన్స్..!

అంతేకాదు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు రూస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో కవిత కుటుంబ సభ్యులను కలుస్తోంది. అయితే ఈరోజు కవితను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు మళ్లీ కవితను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కవిత బెయిల్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పడంతో.. బెయిల్ కోసం కవిత మళ్లీ రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈడీ విచారణ, ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి కేసీఆర్ కవితకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు.

Read also: TS TET 2024: రూ.1000కి చేరిన ‘టెట్’ దరఖాస్తు ఫీజు..! రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు..!

శనివారం ఉదయం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏడుగురు ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఇక్కడి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఊడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత కస్టడీలో ఉండగా (ఎమ్మెల్సీ కవిత అరెస్ట్)… బంధువుల ఇళ్లలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కవిత ఇచ్చిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నాయా…? మరి ఏమైనా తనిఖీలు జరిగాయా అనేది తెలియాల్సి ఉంది.
Pragya Jaiswal : అదిరిపోయే లుక్ లో అఖండ బ్యూటీ స్టిల్స్..