Site icon NTV Telugu

MLC Kavitha : ఇది పనిచేసే ప్రభుత్వం కాదు.. వెంటే ఉండి పని చేయించుకోవాల్సిందే..!

Kavitha

Kavitha

MLC Kavitha : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసిన ఆమె, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లే వ్యక్తిగా, రాష్ట్రానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అమ్మాయిలకు స్కూటీలు, పెళ్లికి లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని చేసిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతోనే నిండి ఉన్నాయని ఆరోపించిన కవిత, సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్‌లో అంబులెన్సులకు డీజిల్ లేక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.

Bhagavad Gita : భగవద్గీత పై ఏఐ షార్ట్ ఫిల్మ్..

రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో 50 శాతం వరకు నాణ్యతలేని దొడ్డుబియ్యమే ఉండటం దారుణమని వ్యాఖ్యానించిన ఆమె, దీనిని ఆధారాలతో నిరూపిస్తామని చెప్పారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాల పేరుతో గ్రామాలకు వెళ్లే బస్సులను తక్కువ చేశారని, ఫ్రీ పథకాలు అందిస్తామనే చెప్పి సేవలు కట్ చేసిన దారుణ పాలన ఇది అని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కూడా ఆమె ఆరోపించారు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు… ప్రజలే వెంటే ఉండి పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హేళన చేసిన కవిత, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!

Exit mobile version