Site icon NTV Telugu

MLC Kavitha: ఎంపీ అరవింద్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా

Kavitha

Kavitha

Kavita strong warning BJP MP Arvind: నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ పై ఎమ్మెల్యే కవిత సంచళన వ్యాక్యలు చేశారు. తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ ఫైర్‌ అయ్యారు. తనను వ్యక్తి గతంగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్టీవీ ప్రెస్‌ మీట్‌ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్‌ తనపై చేసిన అనుచిత వ్యాక్యలపై మండిపడ్డారు. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో అరవింద్ పెర్‌ ఫార్మెన్స్ సున్నా అని ఎద్దేవ చేశారు.

Read also: Pakistan: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

నేను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారు. కాంగ్రెస్ తో కలిసి గెలిచింది ఎంపీ అరవింద్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.బురదమీద రాయి వేయకూడదని ఊరుకున్నా అని మండిపడ్డారు. రాజకీయాలు చెయ్.. అంతేకాని పిచ్చి వేషాలు వేయకు అంటూ వార్నింగ్ ఇచ్చిరు కవిత. ఇవాళ బాధతో మాట్లాడుతున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు రైతులు అరవింద్ పై చీటింగ్ కేసులు పెడతారని ఆరోపించారు. అరవింద్ ఫేక్ సర్టిఫికెట్ల పై పిర్యాదు చేస్తా అని హెచ్చారించారు. అరవింద్ బురద లాంటి వాడని కవిత వ్యాఖ్యానించారు. అరవింద్ నా గురించి ఇంకో సారి మాట్లాడితే నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా అంటూ మీడియా ద్వారా ఆమె స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అరవింద్ ను మెత్తగా తంతాం అని, అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఒడిస్తా అంటూ సవాల్‌ చేశారు. ఇంతా పౌరుషంగా నేను నా రాజకీయ జీవితంలో మాట్లాడలేదని అన్నారు. నేను ఆవేదనతో ఇలా మాట్లాడతున్న అంటూ ఆమె తెలిపారు. నేను కర్గేతో మాట్లాడలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. లైన్ దాటితే కొట్టి సంపుతాం అంటూ కవిత చేసిన వ్యాక్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
TIGER Wandering.. Farmers Fear: పులుల సంచారం.. పత్తి రైతుల పరుగో పరుగు

Exit mobile version