Komatireddy Venkat Reddy : నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఉదంతం కలకలం రేపింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు అతడిని వెంటనే అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
COVID-19: ‘‘స్ట్రాటస్’’ రూపంలో మళ్లీ తిరిగి వచ్చిన కోవిడ్-19..
పోలీసుల ద్వారా అతడి వివరాలు తెలియగా, అతను మున్సిపాలిటీలో పనిచేసిన మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్‌గా గుర్తించారు. మంత్రి అనుచరుల ఒత్తిడితో తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, న్యాయం లభించకపోవడంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Extramarital Affair: ఫోన్ దొంగతనంతో బట్టబయలైన భార్య “వివాహేతర సంబంధం”..
