NTV Telugu Site icon

బీజేపీ వాళ్ళు పగటి వేశగాళ్ళు : బాల్క సుమన్

హుజురాబాద్ లోని తెరాస కార్యకర్తల సోషల్ మీడియా సమావేశానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసినట్లు లెటర్ ప్యాడ్ తో ఉన్న లెటర్ నిజమైన దీ, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస్తున్న ప్రచారం కల్పితం. ఈటల రాజేందర్ లెటర్ ఫెక్ అని దమ్ముంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేయగలరా! అని అన్నారు. ఈటల రాజేందర్ పేరు ఇకనుండి వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి. ఈటల ఆత్మభిమానానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు, ఢిల్లీ దగ్గర మొకరిల్లాడు అని తెలిపారు.

Read Also : యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..

ఈటల రాజేందర్ కాదు ఇక నుండి బీజేపీ రాజేందర్ గానే మిగిలిపోతారు. బీజేపీ వాళ్ళు డబ్బు సంచులతో వస్తారు జాగ్రత్త, గతంలోనే ఈటల రాజేందర్ చెప్పారు. నాకు 200 ఎకరాలు హైదరాబాద్ లో ఉన్నాయి, ఒక్క ఎకరం అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు పెడుతా అన్నారు. కేసీఆర్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు నేను బానిస నే అని స్పష్టం చేసారు. 2001 నుండి మా కుటుంబం టి ఆర్ ఎస్ కేసీఆర్, మరి మీరు పూటకో పార్టీ మార్చే వాళ్ళు నాకు నీతులు చెప్పుతారా. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తోన్న చరిత్ర నాది, అధికారం కోసం పార్టీలు మార్చే చరిత్ర బీజేపీ వాళ్ళది. బీజేపీ వాళ్ళు పగటి వేశగాళ్ళు, పార్టీలు మార్చే ద్రోహులు వాళ్ళు అని పేర్కొన్నారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నిక అయ్యేవరకు ఇక్కడే ఉంటా అని స్పష్టం చేసారు.