Ponnam Prabhakar: రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ చెరువులను భూములను, ఆక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించదన్నారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్ చంద్ కు నివాళులర్పించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
Read also: Lover Attacked: బ్యూటీషియన్ పై కత్తితో దాడి… యువతి మృతి..
ఎఫ్ టి ఎల్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్.టి.ఎల్ కింద చెరువులలో నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లా లో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందని ప్రభుత్వ చెరువులను భూములను,ఆక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించదన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్రంలో గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి నిర్మూలించేందుకు సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి గంజాయిని రాష్ట్రంలో లేకుండా చేస్తామన్నారు.
Wrong Driving: దిమ్మతిరిగే షాక్.. రాంగ్ రూట్ లో వెళ్తే లైసెన్స్ లు రద్దు..