NTV Telugu Site icon

Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!

Kodipunju

Kodipunju

Karimnagar: కరీంనగర్ లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో పుంజు లభ్యమైంది. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచిలో కోడిపుంజు గుర్తించిన డ్రైవర్. సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. గత 4 రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును ఉంచి అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాల మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఆశక్తి కరంగా మారింది. ఆర్టీసీ అధికారులు కోడి పుంజు వేలం పాటలో పుంజును ఎవరు దక్కించుకోనున్నారనేది ఉత్కంఠంగా మారనుంది. ఈ వేలంలో పుంజు ఎవరు దర్కించుకోనున్నారనేది చూడాలంటే మధ్యహ్నం 3 వరకు వేచిచూడాల్సిందే.

Read also: PM Kisan Tractor Yojana: రైతుల కోసం.. ‘పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ యోజన’ ఇందులో నిజమెంత ?

పుంజు కథ ఇది..

గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు. ఆ కోడి సుమారు 6 కిలోల వరకు ఉంటుందని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. అయితే కోడిపుంజు కోసం దానికి సంబంధించిన తాలుకు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును బంధించారు. కాగా.. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజు బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొనగలరని తెలిపారు. అయితే.. ఇప్పుడు కోడిపుంజు వేలంకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..!