NTV Telugu Site icon

Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..

Karimnagar

Karimnagar

Karimnagar: కోతి చేష్టలు కోన్ని సందర్బాల్లో మనుషులకు నష్టం కలిగించినప్పటికి నవ్వుతు కోతిచేష్టలు అంటు కోట్టిపారేస్తుంటాం… కాని అవే చేష్టలు కోతులను చిక్కుల్లో పడేసాయి. ఇబ్బందుల్లో వున్న కోతులను స్థానికులకు కాపాడుతామని అనుకున్న స్థానికులకు చుక్కలు చూపించాయి. కోద్దిసేపు స్థానికులను హైరాన పరచిన చివరకు నవ్వుతెప్పించాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతి చేష్టలు ఆశ్చర్యానికి గురిచేసి ఆటపట్టించాయి. ఈ రోజు ఉదయం రామడుగు మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటి యజమానులు అక్కడి నుండి పరుగుతీశారు. దీంతో అవి దర్జాగా ఇంట్లో చేరి గడియ పెట్టుకున్నాయి.పాపం తిరిగి గడియా తీసుకునేందుకు వాటికి సాద్యం కాలేదు. తోటి కోతులు ఆపదలో ఉన్నాయి అని గమనించిన కోతులు ఇల్లును చుట్టుముట్టాయి. దీంతో అక్కడ యుద్దవాతవరణం నెలకోంది. ఇంటి యజమాని స్థానికుల సహయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికి కుదరలేదు. పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా బావించిన కోతులు ప్రతిఘటించాయి. కట్టే తో కిటికిలో నుండి గడియతీసేందుకు ప్రయత్నించిన స్థానికుల ప్రయత్నానికి అవి అడ్డుకున్నాయి. ఇక కోతుల ఇబ్బందులు చూడలేక చివరకు కిటికీని కట్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. చివరకు స్థానికులు, యజమాని కలిసి కట్టర్ సహయంతో కిటికీని కట్ చేసి తొలగించారు .అవి బయటకు వచ్చేందుకు కొబ్బరి చిప్పలు ఎరగా వేసి వాటిని బయటకు వచ్చేలా చేసారు. అయినప్పటికి అరగంట సమయం తీసుకుని మనుషుల కదలికలు కనపడకపోయే సరికి రెండు కోతులు బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు కోతుల చేష్టలపై నవ్వుకున్నారు.
Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..

Show comments