కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చూశారు. దళితుల దారిద్రయాన్ని పోగెట్టెందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. ఒక దళిత కుటుంబానికి నేరుగా రూ.10లక్షలు ఖాతాలో వేయడం సంతోషకరమైన విషయం అన్నారు. రూ.500కోట్లు కేవలం మొదటి వీడుత మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అందరికి దళిత బంధు అమలు అవుతుంది.
అయితే కేంద్రంలో బిజేపి ఉంది.. ఇలాంటి పథకం కోసం ఎందుకు ఆలోచించడం లేదు. బండి సంజయ్ రూ.50లక్షలు ఇవ్వాలని అన్నడు. అమిత్ షాతో పాటు బిజేపి నాయకులు అందరు అబద్ధాల కొరులే. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు అన్ని పెంచి ప్రజల నడ్డి విరుస్తుర్రు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ బిజేపి. మొదటి విడుత 5వేల దళిత కుటుంబాలకు లబ్ధి చేకరనుంది అని పేర్కొన్నారు.